Ani: ఇండియా కూటమి ర్యాలీతో ఢిల్లీ వ్యాపారులకు రూ.11,000 కోట్ల నష్టం !

నిన్న మూతపడ్డ 2.5 లక్షల దుకాణాలు!
వెల్లడించిన ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ ఇండస్ట్రీ (సీటీఐ) ఛైర్మన్ బ్రిజేష్ గోయల్
ఇండియా కూటమి ర్యాలీ వల్ల రామ్ లీలా మైదాన్ సమీపంలోని 20 నుండి 25 ప్రధాన మార్కెట్లు ప్రభావితమయ్యాయి
ర్యాలీకి పెద్ద సంఖ్యలో ప్రజలు, వాహనాలు వస్తారనే భయాందోళనల కారణంగానే దుకాణాలను మూసేసారు
ఢిల్లీ చుట్టుపక్కల పట్టణాల నుంచి వినియోగదారులు, సరఫరాదారులు, డీలర్ల రాకపోకలపై ప్రభావం పడింది..
వ్యాపార నిమిత్తం ఢిల్లీకి వచ్చే వారు 3 లక్షల నుంచి 4 లక్షల మంది రాలేదు
చిన్న టెంపోలు, ట్రక్కులు సహా సుమారు 5,000 వాహనాలు నిలిచిపోవడం వల్ల సరుకు రవాణాకి అంతరాయం కలిగింది
దుకాణాలు తెరిచి ఉన్న చోట కూడా అమ్మకాలు లేవు...అసలు వినియోగదారులే లేరు
ట్రేడింగ్ రంగం సుమారు రూ.11,000 కోట్ల నష్టాన్ని చవిచూసింది ..ట్రేడర్లకు ఈ పరిహారం ఎవరు చెల్లిస్తారు
దీపావళి, ధంతేరస్ షాపింగ్ సమయం లో ర్యాలీ వల్ల నష్టాలు పెరిగాయి
మేము ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తులో లేమ
ప్రజాస్వామ్య నిరసనలకు మేము వ్యతిరేకం కాదు.
ర్యాలీ నిర్వహించే సమయం, వేదిక సరైంది కాదు
రామ్‌లీలా మైదాన్ ఆసియాలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రం నడిబొడ్డున ఉంది.
ఇక్కడ చాందినీ చౌక్, సదర్ బజార్, ధరియాగంజ్, మోరీ గేట్, కాశ్మీర్ గేట్ వంటి ప్రధాన మార్కెట్లు మూడు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి
👆🏻బ్రిజేష్ గోయల్
ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ ఇండస్ట్రీ (సీటీఐ) ఛైర్మన్





