సికింద్రాబాద్ స్టేషన్‌లో రూ.60 లక్షల నకిలీ కరెన్సీ పట్టివేత.. 19 ఏళ్ల యువకుడు అరెస్ట్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ.60 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లను GRP, RPF పోలీసులు పట్టుకున్నారు.
జైపూర్ నుంచి హైదరాబాద్ మీదుగా ముంబైకి వెళ్తున్న ముంబై LTT ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్‌లో రాజస్థాన్‌కు చెందిన శివరతన్ మహియా (19)ను అదుపులోకి తీసుకున్నారు.
అతడి వద్ద నుంచి నకిలీ కరెన్సీ ఉన్న బ్యాగ్‌తో పాటు ఐఫోన్, రైలు టికెట్ స్వాధీనం చేసుకున్నారు.
ఒక్కోసారి రూ.20 వేల కమీషన్‌కు నకిలీ నోట్లు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న ఓం ప్రకాష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.





