కరీంనగర్‌లో విషాదం.. షాద్‌నగర్‌కు చెందిన ఎల్‌ఎల్‌బీ విద్యార్థిని ఉరి వేసుకొని బలవన్మరణం!

శాతవాహన యూనివర్సిటీలో చదువుతున్న చంద్రకళ మృతి.. ఆత్మహత్యకు కారణాలపై పోలీసుల దర్యాప్తు
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన చంద్రకళ అనే న్యాయ విద్యార్థిని శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ రెండో సంవత్సరం చదువుతుంది.
చదువులో కొనసాగుతున్న యువ విద్యార్థిని ఆకస్మిక మృతితో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువతి అర్ధాంతరంగా తనువు చాలించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఆత్మహత్యకు కారణాలేమిటి?
చంద్రకళ ఈ అఘాయిత్యానికి పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వ్యక్తిగత సమస్యలా? చదువుకు సంబంధించిన ఒత్తిడా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం. అయితే, ఎలాంటి కారణాన్నీ ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారించలేదు. పోలీసుల విచారణ పూర్తయితేనే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.





