అమరావతి: ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్

రాష్ట్రవ్యాప్తంగా 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు
13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో ఎన్నికలు
పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న ఎన్నికల యంత్రాంగం
ఈరోజు పోలింగ్ సామగ్రి పంపిణీ, బ్యాలెట్ బాక్సుల తరలింపు
పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ఎన్నికల సిబ్బంది
రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు
రాష్ట్రవ్యాప్తంగా 36,351 మంది పోలీసులతో భారీ బందోబస్తు
జిల్లాల పోలీసులతో పాటు ఏపీఎస్పీ, ఇతర విభాగాల సిబ్బంది మోహరింపు
4,372 పోలింగ్ స్టేషన్ లొకేషన్ల పరిధిలో భద్రతా ఏర్పాట్లు
671 అత్యంత సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా
అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో 3,355 మంది పోలీసుల మోహరింపు
1,233 సమస్యాత్మక కేంద్రాల్లో 4,943 మంది పోలీసులతో భద్రత
డ్రోన్లు, సీసీ కెమెరాలు, వీడియో చిత్రీకరణతో నిరంతర నిఘా
1,543 రూట్ మొబైల్ బృందాలతో పోలీసుల పర్యవేక్షణ
481 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు, 347 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాల ఏర్పాటు
చెక్‌పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్లతో నిరంతర తనిఖీలు
బ్యాలెట్ బాక్సులు భద్రపరిచే 111 స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 4,655 మంది పోలీసులతో భద్రత
పోలింగ్ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు
ఎన్నికల అక్రమాలు, ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలపై ప్రత్యేక నిఘా
అక్టోబర్ 15 నుంచి 29 వరకు 261 ఎన్నికల సంబంధిత కేసులు నమోదు
ఎన్నికల కేసుల్లో 107 మంది అరెస్ట్, 733 మందికి పోలీసుల నోటీసులు
ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిళ్లకు గురికాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి
నవంబర్ 2న అవసరమైన చోట రీపోలింగ్
నవంబర్ 3న ఓట్ల లెక్కింపు





