🚨 మ్యూల్ బ్యాంక్ అకౌంట్ల రాకెట్ బస్టెడ్.. ₹10.04 కోట్ల సైబర్ మోసాలకు లింక్!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్, చార్మినార్ జోన్ బృందం అట్టాపూర్ పోలీసులతో కలిసి మ్యూల్ బ్యాంక్ అకౌంట్లు సరఫరా చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసింది. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
ఒక్కో బ్యాంక్ అకౌంట్ కిట్‌కు ₹20,000–₹25,000 తీసుకుని సైబర్ నేరగాళ్లకు అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
దర్యాప్తులో 22 బ్యాంక్ బ్రాంచ్‌లకు చెందిన 83 మ్యూల్ అకౌంట్లు బయటపడగా, వాటిలో 11 ఖాతాలు దేశవ్యాప్తంగా జరిగిన 14 సైబర్ ఫ్రాడ్ లావాదేవీలకు, సుమారు ₹10.04 కోట్ల మోసాలకు సంబంధం ఉన్నట్లు తేలింది.
⚠️ మీ బ్యాంక్ ఖాతా, ATM, SIM లేదా లాగిన్ వివరాలను ఎవరికీ అద్దెకు ఇవ్వొద్దు, అమ్మొద్దు. అలా చేస్తే ఖాతా ఫ్రీజ్ కావడంతో పాటు క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
📞 Cyber Fraud Helpline: 1930





