“కబ్జాలకు చెక్.. గుట్టలబేగంపేటలో HYDRAA ఫెన్సింగ్!”
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేట సర్వే నంబర్ 63లోని ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి కాపాడేందుకు HYDRAA చర్యలు చేపట్టింది.
మొత్తం 78 ఎకరాలు ఉన్న ఈ సర్వే నంబర్‌లో భూమి వివాదం హైకోర్టులో ఉండగా, స్టేటస్ కో ఉత్తర్వులు కొనసాగుతున్నప్పటికీ కొత్త ప్లాట్ల విక్రయాలు, నిర్మాణాలు జరుగుతున్నాయని రెవెన్యూ అధికారులు HYDRAA దృష్టికి తీసుకెళ్లారు.
కోర్టు ఉత్తర్వుల ప్రకారం యథాస్థితిని కొనసాగించేందుకు రెవెన్యూ అధికారుల సమక్షంలో HYDRAA 500 మీటర్లకు పైగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, కొత్త ఆక్రమణలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంది.





