భూటాన్‌లో బద్దలైన హిమ సరస్సు, భారత్ వైపు దూసుకొస్తున్న వరదనీరు, హై అలర్ట్
భూటాన్ కొండల్లో బద్దలైన హిమ సరస్సు.. భారత్ వైపు దూసుకొస్తున్న వరదనీరు! నది తీర ప్రాంతాల్లో హై అలర్ట్
భూటాన్‌లోని గాసా జిల్లాలో Shintaphu హిమ సరస్సు బద్దలవడంతో భారీగా నీరు దిగువ ప్రాంతాల వైపు ప్రవహిస్తోంది. ఈ నీరు Mo Chhu–Sankosh నదీ వ్యవస్థ ద్వారా భారత్ వైపు వచ్చే అవకాశం ఉండటంతో పశ్చిమ బెంగాల్, అసోంలో హై అలర్ట్ ప్రకటించారు.
అలీపుర్‌ద్వార్, కూచ్‌బెహార్ ప్రాంతాల్లో Sankosh నది పరివాహక ప్రాంతాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. SDRF, Civil Defence బృందాలు రంగంలో ఉండగా NDRF బృందాలను కూడా సిద్ధం చేశారు. వేలాది మందిని ఇప్పటికే షెల్టర్లు, సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
Central Water Commission Sankosh నది నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తోంది.
అధికారులు మాత్రం “భయపడాల్సిన అవసరం లేదు.. అప్రమత్తంగా ఉండండి, నది తీరాలకు వెళ్లవద్దు” అని సూచిస్తున్నారు.





