రాజమండ్రిలో తుఫాను ఎఫెక్ట్.. V2L ఫీచర్‌తో ఇంటికి విద్యుత్ అందించిన టాటా కర్వ్ ఈవీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రాజమండ్రిలో తుఫాను అర్నాబ్ కారణంగా ఉదయం 5 గంటల నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇన్వర్టర్ బ్యాటరీ కూడా అయిపోవడంతో ఇబ్బందులు తప్పలేదు.
స్థానికుడు ఇందర్ రాజు తన టాటా కర్వ్ ఈవీ (Tata Curvv EV) కారులోని V2L ఫీచర్‌ను ఉపయోగించి ఇంటికి విద్యుత్ అందించారు. రాత్రి 8:30 గంటల సమయంలో కారును ఇన్వర్టర్కు అనుసంధానించారు.
ఈ కారు ద్వారా 3 ఫ్యాన్లు, 5 లైట్లను 13 గంటల పాటు రన్ చేశారు. ఈ క్రమంలో కారు బ్యాటరీ 13% SoC (56% నుండి 43%కి) తగ్గింది.
సుమారు 220 వోల్టుల వద్ద 2 ఆంపియర్ల విద్యుత్ లోడ్‌ను కారు సరఫరా చేసింది. తుఫాను సమయంలో ఈవీ కారు ఇంటికి వెలుగునిచ్చింది.





