2 నెలల చిన్నారి కడుపులో మరో భ్రూణం.. అరుదైన సర్జరీతో ప్రాణం కాపాడిన బళ్లారి వైద్యులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కర్ణాటకలోని బళ్లారిలో అత్యంత అరుదైన ‘Fetus in Fetu’ కేసుకు వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. రెండు నెలల బాలుడి కడుపులో ఉన్న భ్రూణాన్ని సర్జరీ ద్వారా తొలగించారు.
ఈ సమస్యను గర్భధారణ సమయంలోనే గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. పుట్టిన తర్వాత అవసరమైన పరీక్షలు నిర్వహించి, చిన్నారికి సురక్షితంగా ఆపరేషన్ పూర్తి చేశారు.
‘Fetus in Fetu’ అనేది అభివృద్ధి చెందని జంట భ్రూణం మరో శిశువు శరీరంలో ఉండిపోయే అత్యంత అరుదైన జన్యుపరమైన పరిస్థితి. సుమారు 5 లక్షల జననాల్లో ఒక కేసు కనిపించవచ్చని వైద్యులు పేర్కొన్నారు.
సంక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన బళ్లారి వైద్య బృందంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.





