‘తెలంగాణ $3 ట్రిలియన్ లక్ష్యానికి కేంద్రం అండ’.. పీయూష్ గోయల్ కీలక ప్రకటన

ఢిల్లీలో జరిగిన ‘Invest Telangana Global Summit 2026’ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర లక్ష్యానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే Viksit Bharat 2047 లక్ష్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
తెలంగాణకు వాణిజ్యంలో చారిత్రక నేపథ్యం ఉందని గుర్తుచేస్తూ, 700 ఏళ్లకుపైగా క్రితమే కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు మోతుపల్లి శాసనం ద్వారా సముద్ర వాణిజ్యానికి ప్రోత్సాహం ఇచ్చారని ప్రస్తావించారు.
హైదరాబాద్ ఇప్పటికే GCCలు, AI, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో ముందంజలో ఉందని, Aerospace, Defence, Quantum Computing వంటి కొత్త రంగాల్లోనూ మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని గోయల్ అన్నారు.
డిసెంబర్ 7–9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో Invest Telangana Global Summit 2026 జరగనుంది.





