బ్లూ డ్రమ్ తెరిచేసరికి ₹500 నోట్ల గుట్టలు.. ఇంటి కింద దాచిన కోట్ల నగదు!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నవాబ్‌గంజ్ పరిధి బరైపూర్ గ్రామంలో ఓ ఇంటి నేల కింద పాతిపెట్టిన మూడు బ్లూ డ్రముల్లో భారీగా నగదు బయటపడటం కలకలం రేపింది.
డ్రములను తెరిచి చూడగా ₹500 నోట్ల కట్టలు కనిపించాయి. ఇప్పటివరకు కోట్ల రూపాయల నగదు లెక్కించినట్లు సమాచారం ఉండగా, మొత్తం ఎంత ఉందన్నది అధికారిక లెక్కింపు పూర్తయ్యాకే స్పష్టమవుతుంది.
పోలీసులు ఇంటిని సీజ్ చేసి, నగదు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిది? ఎందుకు నేల కింద దాచారు? అనే కోణాల్లో విచారణ చేపట్టారు. ఆదాయపు పన్ను శాఖకు కూడా సమాచారం అందించారు.





