ఏడాదిన్నరలో భూముల రీ సర్వే పూర్తి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏడాదిన్నరలోపు తెలంగాణలో భూముల రీ సర్వే పూర్తవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సంగారెడ్డిలో మాట్లాడిన ఆయన.. ధరణిని బంగాళాఖాతంలో వేసి భూ భారతిని తీసుకొచ్చామన్నారు. వివాదరహిత భూములను రాబోయే తరానికి అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రతిపక్షాలను తీసుకుని త్వరలోనే ఢిల్లీకి వెళ్తామని మంత్రి స్పష్టం చేశారు.





