ఏపీ తీరానికి మరింత దగ్గరగా ‘అర్నబ్’.. రేపు ఉదయం యానాం సమీపంలో ల్యాండ్‌ఫాల్!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బంగాళాఖాతంలో ‘అర్నబ్’ అత్యంత తీవ్ర తుఫానుగా (Very Severe Cyclonic Storm) కొనసాగుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా కదులుతోంది. తాజా అంచనాల ప్రకారం తుఫాను అక్టోబర్ 28 ఉదయం బాపట్ల–విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది.
తీరం దాటే సమయంలో గంటకు 115–125 కి.మీ. వేగంతో గాలులు, గరిష్ఠంగా 140 కి.మీ. వరకు వీచే అవకాశం ఉందని IMD హెచ్చరించింది.
కోస్తాంధ్రలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన గాలుల ప్రభావం ఉండొచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.





