21 ఏళ్ల బీటెక్ విద్యార్థి స్పాట్‌డెడ్.. లారీ ఢీకొని అభిలాష్ రెడ్డి మృతి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 21 ఏళ్ల బీటెక్ విద్యార్థి ఏమిరెడ్డి అభిలాష్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.
సీవీఆర్ కాలేజీలో బీటెక్ చదువుతున్న అభిలాష్, తన మిత్రుడిని హయత్‌నగర్ బస్టాండ్‌లో దింపి తిరిగి వెళ్తుండగా లారీ ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడి తండ్రి విష్ణువర్ధన్ రెడ్డి నల్లగొండ పట్టణంలోని ప్రేరణ స్కూల్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. కుమారుడి హఠాన్మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.





