మాజీ మంత్రి,పేర్ని నాని

మాకు ఓట్లు వేయండని చంద్రబాబు,పవన్,మాధవ్ అడుగుతున్నారు
ఏపీ ప్రజలు ఎందుకు మీకు ఓట్లు వేయాలి కనీసం మీ అంతరాత్మను ప్రశ్నించుకోరా
మీకు ఎందుకు ప్రజలు ఓట్లు వేయాలని ప్రశ్నిస్తున్నా
ప్రజలను లూఠీ చేసినందుకు ఓట్లు వేయాలా
బియ్యం కట్ట 2600 రూపాయలకు చేరినందుకు మీకు ఓట్లు వేయాలా
నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నందుకు ఓట్లు వేయాలా
కేజీ ఉల్లిపాయలు 60 రూపాయలకు తెచ్చినందుకు ఓట్లు వేయాలా
మీరు ముగ్గురూ జనం సొమ్ముతో స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నందుకు ఓట్లు వేయాలా
హెలీకాప్టర్లలో హైదరాబాద్ కు వారంవారం ట్రిప్పులు వేస్తున్నందుకు ఓట్లు వేయాలా
పాదయాత్రలో సెల్ఫీలు దిగుతూ లోకేష్ తో చాలా మాట్లాడించారు
అప్పుడు పెట్రోల్ బంక్ ల ముందు సెల్ఫీలు దిగారు
ఇప్పుడు పెట్రోల్,డీజిల్ ఎంత ఉన్నాయో తెలియదా
రేట్లు తగ్గాలంటే చంద్రబాబుకు ఓటు వేయాలన్నారు ఎందుకు రేట్లు తగ్గడం లేదు
కరెంట్ ఛార్జీలు పెంచలేదని చెబుతున్నాడు చంద్రబాబు మాటలన్నీ ట్రూ డౌన్ మాటలే
చంద్రబాబు ఒక ఫేక్ సీఎం
చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్దాలే
ఈ రాష్ట్రానికి మీరు ఏం పొడిచేశారో సమాధానం చెప్పాలి
మీది ఆలీ బాబా ఇద్దరు దొంగల కూటమి ఈ రెండున్నరేళ్లలో ప్రజల నెత్తిన వేసిన బండ సరిపోవట్లేదా
ట్రిపుల్ ఇంజన్ సర్కారు రావాలంటున్నారు
ఈ రెండున్నరేళ్లలో ప్రజలను దంచి దంచి వదిలిపెట్టారు
మున్సిపాల్టీల్లోనే మంచి నాయకత్వం కావాలా
జిల్లా పరిషత్ ఎన్నికల్లో మంచి నాయకత్వం వద్దా
మండలాల్లో ప్రత్యక్ష ఎన్నికలు అవసరం లేదా
నీతి నిజాయితీకి పెద్ద పీట వేశానని చెప్పుకుంటున్నారు
చంద్రబాబు,పవన్ మీ ఎమ్మెల్యేలు,మంత్రులనే నిజాయితీగా ఉంచలేకపోయారు
అర్నబ్ తుఫాన్ వల్ల అభ్యర్దులను ఎంపిక చేయలేకపోయామని పవన్ చెబుతున్నారు
కార్యకర్తలేనా త్యాగాలు చేయాల్సింది మీరు,మీ అన్నయ్య మాత్రం త్యాగాలు చేయరా
జనసేన కార్యకర్తలు 2024లో వైసిపితో గొడవలు పడ్డారు ఇప్పుడు టిడిపితో గొడవలు
పడుతున్నారు
లక్షా 50 వేల కోట్లతో పల్లె పండుగ చేశామని చెబుతున్నారు
లక్షా 50 వేల కోట్ల అభివృద్ధి ఎక్కడ ఉంది...ఏ గ్రామంలో ఉంది
ప్రమాణస్వీకారం చేయగానే ప్రతీ పంచాయతీలో జెండా పండుగ చేయమన్నారు
చెత్తలో కూడా దోచుకుంటున్న చెత్త ప్రభుత్వం
ప్రభుత్వం మారితే చెత్త నుంచి ఎంతదోచుకున్నారో బయటికివస్తాయి
పంచాయతీల్లో వీధి లైట్లు వేయడానికి డబ్బుల్లేవ్
పంచాయతీల్లో సున్నం కొట్టడానికి కూడా డబ్బుల్లేవ్
ప్రజలారా ఆలోచించండి ఒక్క సారి వాత పెడితే తప్ప ఈ ప్రభుత్వంలో మార్పు రాదు





