25 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి… కేబుల్ బ్రిడ్జి వద్ద విషాదం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది.
విశాఖపట్నానికి చెందిన రాజేష్ (25) నాచారంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. మాదాపూర్‌లోని స్నేహితులను కలిసేందుకు వెళ్లిన అనంతరం, దుర్గం చెరువులోకి దూకినట్లు ప్రాథమిక సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని రాజేష్ కోసం దుర్గం చెరువులో గాలింపు చర్యలు చేపట్టాయి.
ఘటనకు దారితీసిన కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.





