ఎల్‌బీఎస్ నగర్‌లో గంజాయి విక్రేత అరెస్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ ఎల్‌బీఎస్ నగర్‌లో ఇంటి నుంచే గంజాయి అమ్ముతున్న 75 ఏళ్ల షేక్ జాతెన్ బీని ఈగల్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. నిందితురాలి ఇంట్లో 179.1 గ్రాముల గంజాయి ఉన్న 41 ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఆపరేషన్‌లో 70 మంది వినియోగదారులను గుర్తించగా.. 66 మందికి టెట్రాహైడ్రోకాన్నాబినాల్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పట్టుబడ్డ వారిలో ముగ్గురు బాలలు ఉండగా.. 65 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.





