నేపాల్ వ్యక్తులను పనిలో పెట్టుకుంటే జాగ్రత్త

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
చాలా కేసుల్లో నేపాలీలు నేరస్తులుగా ఉన్నారని సీపీ సజ్జనార్ వెల్లడించారు. తనూజ హత్య కేసులో కల్పనా, గణేష్, చంద్ర బహుదూర్, గణేష్ బహదూర్ షాహీలను అరెస్ట్ చేసి, వారిపై ఉన్న 5 ఎన్‌బీడబ్ల్యూలను ఎగ్జిక్యూట్ చేశామన్నారు. 8 కేసులున్న జీవన్ చంద్ అనే మరో నేపాలీని కూడా పట్టుకున్నామన్నారు. నేపాల్ వ్యక్తులు ఇక్కడికి వచ్చి అడ్రస్‌తో ఆధార్ కార్డులు తయారు చేసుకుంటున్నారని.. వారిని పనిలో పెట్టుకునే ముందు నేపాల్ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని సూచించారు.





