బర్త్‌డే వేడుకలకు వెళ్లి విగతజీవిగా.. ఫామ్‌హౌస్‌లో రిటైర్డ్ ఎస్సై కుమారుడి అనుమానాస్పద మృతి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ శివారులోని ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఏదులాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. బర్త్‌డే వేడుకలకు వెళ్లిన యువకుడు ఓ ఫామ్‌హౌస్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
మృతుడిని ఉప్పల్ భగాయత్‌కు చెందిన రిటైర్డ్ ఎస్సై ప్రవీణ్ కుమారుడు కృష్ణగా గుర్తించారు. స్నేహితులతో కలిసి బర్త్‌డే వేడుకలకు వెళ్లిన కృష్ణ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
కృష్ణ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఘట్‌కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఘటన సమయంలో ఫామ్‌హౌస్‌లో ఎవరు ఉన్నారు? ఏం జరిగింది? అనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు తర్వాతే మృతికి గల అసలు కారణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.





