ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అమ్మవారి దర్శనం అనంతరం ఆలయంలో ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులను అభినందించారు.
సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కలిగేలా ఏర్పాట్లు అద్భుతంగా చేశారని కొనియాడారు.
అధికారులు, సర్కార్ చేసిన ఏర్పాట్లకు హ్యాట్సాఫ్ చెప్పారు.
తాను నడుస్తూ వెళ్తున్నప్పుడే భక్తులకు తాగునీరు, మజ్జిగ, ప్రసాదం అందిస్తున్న తీరు చూసి చాలా సంతోషం వేసిందని తెలిపారు.
అమ్మవారి దర్శనం మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా జరిగిందని బోయపాటి శ్రీను పేర్కొన్నారు.
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను ఏర్పాట్లపై హ్యాట్సాఫ్ చెప్పారు.





