కేటీఆర్ ప్రెస్ నోట్..

సిరిసిల్ల జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి..
402 కోట్లతో మంజూరైన శాశ్వత క్యాంపస్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి..
కొత్త క్యాంపస్ పూర్తయ్యే వరకు ప్రస్తుత ప్రాంగణంలోనే కళాశాల కొనసాగించాలి..
2021లో 402 కోట్ల అనుమతులతో మంజూరైన జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల క్యాంపస్ నిర్మాణం పెండింగ్‌లో ఉంది..
కేటీఆర్ పేర్కొన్నారు.
మంధేపల్లి గ్రామంలో 20 ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ, నిర్మాణ పనులు ప్రారంభం కావడం లేదు..
కళాశాలను ప్రస్తుత ప్రాంగణం నుంచి మరో ప్రైవేటు భవనానికి తరలించే ప్రతిపాదనలు విద్యార్థులు, అధ్యాపకులకు ఇబ్బందులు కలిగించే అవకాశం..
తరగతి గదులు, ప్రయోగశాలలు, ఇతర మౌలిక సదుపాయాలు నిరుపయోగం కాకుండా చూడాలి..
శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసి పనులను వేగవంతం చేయాలి..
కొత్త క్యాంపస్ పూర్తయ్యే వరకు కళాశాలను ప్రస్తుత ప్రాంగణంలోనే కొనసాగించేందుకు అనుమతించాలి..
రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించడంలో కళాశాల కీలకం..
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమస్యలను పరిష్కరించేందుకు CM తక్షణమే జోక్యం చేసుకోవాలి..





