Full post (tap chesthe copy avutundi):

క్యాన్సర్‌పై సమష్టి పోరాటంతోనే విజయం సాధ్యం-మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్
క్యాన్సర్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి: వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్
గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో క్యాన్సర్ రన్
భారీ సంఖ్యలో పాల్గొన్న యువతీ, యువకులు
జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ లు
హైదరాబాద్: క్యాన్సర్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికీ తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీ, క్యాన్సర్ రన్‌లో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో యువతీ, యువకులు ఈ రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన గ్రేస్ ఫౌండేషన్ నిర్వాహకులకు, పాల్గొన్న ప్రజాప్రతినిధులకు, పోలీసు అధికారులకు, యువతీ యువకులకు మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ లు అభినందనలు తెలిపారు.





