తెలుగు ఎడిషన్ · 5 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
#783 updateస్ట్రెచర్ లేక దివ్యాంగ సోదరుడిని భుజాలపై మోసిన మహిళకొమురం భీం జిల్లాలో కలకలం.. చేనులో 364 గంజాయి మొక్కలు సీజ్అట్లాంటిక్ మహాసముద్రంలో ఎయిర్ అంబులెన్స్ గల్లంతు.. ఆరుగురు మృతితిరుపతి: తిరుమల. నడక మార్గంలో చిరుత సంచారం..నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన🚨 మీ ఇంట్లో ఎవరెస్ట్ జీలకర్ర పొడి ఉందా? వాడే ముందు బ్యాచ్ నంబర్ చెక్ చేయండి!రష్యా సైబీరియాలో ల్యాబ్ ప్రమాదం.#783 updateస్ట్రెచర్ లేక దివ్యాంగ సోదరుడిని భుజాలపై మోసిన మహిళకొమురం భీం జిల్లాలో కలకలం.. చేనులో 364 గంజాయి మొక్కలు సీజ్అట్లాంటిక్ మహాసముద్రంలో ఎయిర్ అంబులెన్స్ గల్లంతు.. ఆరుగురు మృతితిరుపతి: తిరుమల. నడక మార్గంలో చిరుత సంచారం..నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన🚨 మీ ఇంట్లో ఎవరెస్ట్ జీలకర్ర పొడి ఉందా? వాడే ముందు బ్యాచ్ నంబర్ చెక్ చేయండి!రష్యా సైబీరియాలో ల్యాబ్ ప్రమాదం.
వాతావరణం
📅 తేదీ వారీగా

🚨 మీ ఇంట్లో ఎవరెస్ట్ జీలకర్ర పొడి ఉందా? వాడే ముందు బ్యాచ్ నంబర్ చెక్ చేయండి!

ప్రత్యేక కథనంజాతీయం
🚨 మీ ఇంట్లో ఎవరెస్ట్ జీలకర్ర పొడి ఉందా? వాడే ముందు బ్యాచ్ నంబర్ చెక్ చేయండి!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

⠀

ఎవరెస్ట్ ‘ప్రీ-ప్యాక్డ్ జీలకర్ర పొడి’లోని ఓ నిర్దిష్ట బ్యాచ్‌ను వెంటనే మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవాలని FSSAI ఆదేశించింది. పరీక్షించిన నమూనా వినియోగానికి సురక్షితం కాదని — “UNSAFE”గా నిర్ధారించింది.

🔎 రీకాల్‌కు గురైన బ్యాచ్ నంబర్: E080668761

గోవాలో సేకరించిన నమూనాలో అజాక్సీస్ట్రోబిన్ (Azoxystrobin), థయామెథాక్సామ్ (Thiamethoxam) పురుగుమందుల అవశేషాలు అనుమతించిన గరిష్ఠ పరిమితులను మించి ఉన్నట్లు గుర్తించారు. రిఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీ పరీక్షలోనూ నమూనా “UNSAFE”గా నిర్ధారణ కావడంతో మొత్తం సంబంధిత బ్యాచ్‌ను రీకాల్ చేయాలని ఆదేశించారు.

⚠️ వినియోగదారులు ఏం చేయాలి?

👉 మీ ప్యాకెట్‌పై ముద్రించిన బ్యాచ్ నంబర్‌ను ఇప్పుడే పరిశీలించండి.

👉 E080668761 ఉంటే ఆ పొడిని వంటల్లో ఉపయోగించవద్దు.

కంపెనీ రీకాల్ రికార్డులు నిర్వహించడంతో పాటు, ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని FSSAI సూచించింది.

మీ కుటుంబంతోనూ ఈ సమాచారం పంచుకోండి. ఆందోళన కాదు.. సరైన బ్యాచ్‌ను గుర్తించి జాగ్రత్త పడటం ముఖ్యం!

ముఖ్య గమనిక: ఈ రీకాల్ పేర్కొన్న బ్యాచ్‌కు మాత్రమే వర్తిస్తుంది. అన్ని ఎవరెస్ట్ జీలకర్ర పొడి ప్యాకెట్లు లేదా ఇతర ఉత్పత్తులను రీకాల్ చేసినట్లు కాదు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు