కొడుకు సంపాదించిన ఆస్తిలో తండ్రికి వాటా ఉంటుందా? 🤔

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కొడుకు తన సొంతంగా సంపాదించిన ఆస్తి అయితే.. తండ్రికి ఆటోమేటిక్‌గా వాటా వస్తుందా? ఇక్కడే చాలామందికి ఉన్న అపోహకు చట్టం క్లారిటీ ఇస్తోంది.
⚖️ హిందూ వారసత్వ చట్టం ప్రకారం, కొడుకు వీలునామా లేకుండా మరణిస్తే, భార్య, పిల్లలు, తల్లి Class-1 వారసులు. వీరికి సమాన వాటా ఉంటుంది.
👉 తండ్రి మాత్రం Class-2 వారసుడు. అందువల్ల Class-1 వారసులు ఉన్నంతవరకు తండ్రికి ఆస్తిలో వాటా రాదు.
ఉదాహరణకు.. భార్య + ఒక పిల్లవాడు + తల్లి ఉంటే.. ముగ్గురికీ సమాన వాటాలు వస్తాయి. తండ్రి వాటా విషయానికి వస్తే.. Class-1 వారసులు ఎవరూ లేని పరిస్థితుల్లోనే ఆయనకు హక్కు వస్తుంది.
📌 అయితే ఆస్తి స్వభావం, వీలునామా, కుటుంబ పరిస్థితుల ఆధారంగా న్యాయపరమైన ఫలితం మారవచ్చు.
ఆస్తి విషయంలో బంధం కంటే ముందు.. చట్టం ఏం చెబుతుందో తెలుసుకోవడం ముఖ్యం.





