అమరావతి మకుటంలో మహా రత్నం.. భవానీ ఐలాండ్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చే అద్భుత అవకాశాలు..!

దేశంలోనే అతిపెద్ద రివర్ ఐలాండ్లలో ఒకటైన భవానీ ఐలాండ్ పై అధికారుల నిర్లక్ష్యం..
పర్యవేక్షణ లోపం, వరద నష్టం, బోట్ల కొరతతో రూపురేఖలు కోల్పోతున్న 131 ఎకరాల భవానీ ఐలాండ్..
సాధారణ రోజుల్లో నెలకు 20 వేలకు పైగా, ఏడాదికి సగటున 3 లక్షల మంది వస్తున్న పర్యాటకులు..
దసరా ఉత్సవాల వేళ ఇంద్రకీలాద్రికి వచ్చే 20 లక్షల మంది భక్తుల్లో 30-35 శాతం మంది విహారానికి వచ్చే అవకాశం..
ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నా క్షేత్రస్థాయిలో సదుపాయాలు సున్నా..
ప్రతి ఏటా వరదల ధాటికి కుంచించుకుపోతున్న ఐలాండ్ విస్తీర్ణం.. కోతకు గురవుతున్న నది ఒడ్డు..
వరదలకు రూ.లక్షల విలువైన ఏసీలు, ఎలక్ట్రికల్ పరికరాలు, ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం..
2024 వరదల్లో నీటమునిగిన హరిత కాటేజీలు, ట్రీ-టాప్ సూట్లు.. మరమ్మతుల బడ్జెట్ ఉన్నా పనులు అరకొరే..
అమరావతికి అత్యంత సమీపంలో ఉన్న ఐలాండ్‌లో ఫ్లోటింగ్ కాటేజీలు, రిటైనింగ్ వాల్స్ నిర్మించాలని పర్యాటకుల డిమాండ్..





