అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ కు చెందిన సుప్రియ మృతి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన దారం సుప్రియ (31) అమెరికాలోని మిస్సోరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం.
ఉద్యోగ రీత్యా అక్కడ నివసిస్తున్న సుప్రియ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ట్రక్ ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. భారత్‌కు చెందిన మరో యువతికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.





