ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే మా లక్ష్యం

చంద్రబాబుకు ఇప్పుడు యంగ్ హార్డ్ వేర్ టీమ్ అండగా ఉంది
పాలసీలు కాలపరీక్షను, రాజకీయ మార్పులను తట్టుకునేలా ఉండాలి
పరిశ్రమదారులను మేం జాతి నిర్మాణకర్తలుగా భావిస్తున్నాం
పాన్ ఐఐటి సమ్మిట్ -2026లో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్
అమరావతి: భారతదేశం ఇప్పటివరకు చూడని మార్పు, అభివృద్ధి, సుపరిపాలనని తీసుకురావడానికి మేము తపన పడుతున్నాం. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చేందుకు మా టీం ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తోందని ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పాన్ ఐఐటి సమ్మిట్ – 2026లో మంత్రి లోకేష్ మాట్లాడుతూ... మేము అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదగాలి... మోదీజీ ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి మా వంతు సహకారం అందించాలన్నదే మా ధ్యేయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం 4.0 ఆపరేటింగ్ సిస్టమ్ తో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఆయనకు ఇప్పుడు ఒక యంగ్ హార్డ్ వేర్ టీమ్ అండగా ఉంది. 50% శాసనసభ్యులు మొదటిసారి గెలిచినవారే, 25 మంది మంత్రులలో 17 మంది మొదటిసారి మంత్రులైనవారు. అనుభవజ్ఞమైన సాఫ్ట్‌వేర్‌కు యువ, డైనమిక్ హార్డ్‌వేర్ కలయికే నేటి ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా, విభిన్నంగా నిలబెడుతోంది. మా టీమ్‌కు ఒక స్పష్టమైన విజన్ ఉంది. ఏ రంగమైనా ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్‌గా ఉండాలి. నా దృష్టిలో పాన్ ఐఐటీ అంటే కంపెనీలు, టెక్నాలజీలు, పరిశోధనా సంస్థలు మొత్తం పరిశ్రమలను నిర్మించిన వ్యక్తులు. పాన్ ఐఐటీ 23 ఐఐటీల పూర్వ విద్యార్థులందరినీ ఒకచోట చేర్చుతుంది. భారతదేశం అంతటా, ప్రపంచ ప్రధాన టెక్నాలజీ హబ్ లలో 5 లక్షలకు పైగా ఐఐటీ గ్రాడ్యుయేట్లను కలుపుతుంది. ఈ కమ్యూనిటీ మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో సమావేశం కావడం ఆనందంగా ఉంది.
భారత్ అభివృద్ధికి దశాబ్ధం చాలు
అమెరికా, యూరప్ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా మారడానికి దాదాపు 100 సంవత్సరాలు పట్టింది. దుబాయ్ దాదాపు 30 సంవత్సరాల్లో, సింగపూర్ సుమారు 25 సంవత్సరాల్లో ఆ స్థాయికి చేరుకున్నాయి. భారత్ ఇప్పుడు ఒక కీలక దశలో ఉంది, అభివృద్ధి సాధించడానికి ఒక దశాబ్దం సరిపోతుందని నేను నమ్ముతున్నాను. ఆ ‘గోల్డెన్ డికేడ్’ మనదే కావాలి. దీనికి త్రీ “ఎస్” మంత్రమే ఆధారం. మొదటిది — స్పీడ్, రెండవది — సర్వీస్, మూడవది — స్టెబిలిటీ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వేగాన్ని చూస్తే స్పీడ్ కు అర్థం తెలుస్తుంది. మా టీమ్ ఇప్పుడు ఆతృతతో ఉంది. ప్రజలు మాకు ఇచ్చింది ఐదు సంవత్సరాల సమయం. ఆ సమయంలోనే ఫలితాలు చూపించాలి. కేవలం ఎంఓయులు కుదుర్చుకుని వాటిని మర్చిపోయే పని మాది కాదు. ప్రాజెక్టులకు వాస్తవ రూపమిచ్చి, వాటి ద్వారా ఉద్యోగాలు సృష్టించాలన్న తపన మాది. రెండోది సర్వీస్. పరిశ్రమల అభివృద్ధిలో ప్రభుత్వానిది ఎంతో కీలకమైన పాత్ర ఉందని మేము నమ్ముతున్నాం. వ్యవస్థాపకులు, పరిశ్రమలను మేము ‘జాతి నిర్మాణకర్తలు’గా భావిస్తున్నాం. మీతో కలిసి పనిచేయాలి, ప్రతి పాలసీని మీతో కలిసి రూపొందించాలి. ప్రపంచ స్థాయ





