హైదరాబాద్‌లో ఓవర్‌స్టేయింగ్ విదేశీయులపై పోలీసుల స్పెషల్ డ్రైవ్

స్పెషల్ బ్రాంచ్, FRRO, లా అండ్ ఆర్డర్, ఐటీ సెల్ సంయుక్త తనిఖీలు
ఇప్పటివరకు 49 మంది విదేశీయులు ఓవర్‌స్టేయింగ్‌లో గుర్తింపు
12 మంది విదేశీయులను ఇప్పటికే స్వదేశాలకు డిపోర్ట్ చేసిన పోలీసులు
మిగిలిన వారిని డిపోర్టేషన్‌కు తరలించే ప్రక్రియ కొనసాగింపు
టోలిచౌకి పరిధిలో అత్యధికంగా 30 మంది ఓవర్‌స్టేయింగ్ గుర్తింపు
లంగర్‌హౌస్, మెహిదీపట్నంలో చెరో 6
రాజేంద్రనగర్‌లో 3, బంజారాహిల్స్‌లో 2, సైఫాబాద్, గుడిమల్కాపూర్‌లో ఒక్కొక్కరు గుర్తింపు
తనిఖీల్లో నకిలీ కరెన్సీ, మోసాలకు పాల్పడుతున్న విదేశీయుల గుర్తింపు
ఓ విదేశీయుడి నుంచి 250 గ్రాముల గంజాయి స్వాధీనం
ఆస్పత్రుల్లో విదేశీ రోగులకు ట్రాన్స్‌లేటర్లుగా పనిచేస్తున్న వారి వ్యవహారాలపై ఆరా
ఆస్పత్రి బిల్లులపై సుమారు 15 శాతం కమిషన్ తీసుకున్నట్లు పోలీసుల గుర్తింపు
టూరిస్ట్ వీసాపై వచ్చి ఓవర్‌స్టే చేసిన కెన్యా మహిళ.. వ్యభిచార కార్యకలాపాల్లో ఉన్నట్లు గుర్తింపు
మరో విదేశీయుడి వద్ద ఆల్ప్రజోలం టాబ్లెట్లు, దగ్గు సిరప్ గుర్తింపు
వీసా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న హైదరాబాద్ పోలీసులు
విదేశీయులకు వసతి కల్పించే యజమానులు పాస్‌పోర్ట్, వీసా వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలి
విదేశీయుల వివరాలను నిబంధనల ప్రకారం పోలీసులకు అందించాలని వసతి నిర్వాహకులకు సూచన
ఓవర్‌స్టేయింగ్, నకిలీ పత్రాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి





