పాక్‌పై భారత్ విజయం.. ఆసియా క్రీడల్లో టీమిండియాకు స్వర్ణం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్ ఫైనల్లో పాకిస్థాన్‌పై 19 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది..
వరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని భారత పురుషుల జట్టు కైవసం చేసుకుంది..
అభిషేక్ శర్మ 28 బంతుల్లో 61, తిలక్ వర్మ 22 బంతుల్లో అజేయంగా 51 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో భారత్ 211/6 స్కోర్ సాధించింది..
212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ను 192/6కే భారత బౌలర్లు కట్టడి చేశారు..
హసన్ నవాజ్ 96 పరుగులతో పోరాడినా పాకిస్థాన్‌కు విజయం దక్కలేదు..
ఇప్పటికే మహిళల జట్టు స్వర్ణం గెలవగా.. పురుషుల జట్టూ నెగ్గడంతో ఆసియా క్రీడల్లో రెండు క్రికెట్ స్వర్ణాలూ భారత్ కైవసం చేసుకుంది..





