అమరావతి

మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు మరో మూడు రోజులు పొడిగింపు
807 దుకాణాలకు అక్టోబర్ 6 అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ
అక్టోబర్ 7న దరఖాస్తుల పరిశీలన
అక్టోబర్ 8న డ్రా ఆఫ్ లాట్స్
అమరావతి
పర్యావరణ నిబంధనలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష
ఆక్వా పరిశ్రమల్లో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
ఆక్వా పరిశ్రమలు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం
సహజ నీటి వనరులను కలుషితం చేసే హక్కు ఎవరికీ లేదన్న డిప్యూటీ సీఎం
128 ఆక్వా ప్రాసెసింగ్, ప్రీ-ప్రాసెసింగ్ యూనిట్లలో 82 యూనిట్ల నుంచి నమూనాల సేకరణ
82 యూనిట్లలో 49 యూనిట్లు నిర్దేశిత పర్యావరణ ప్రమాణాలు పాటించడం లేదని గుర్తింపు
నిబంధనలు పాటించని యూనిట్లలో లీటరుకు 30 మిల్లీగ్రాములు ఉండాల్సిన బీఓడీ 321 మిల్లీగ్రాముల వరకు నమోదు
సుమారు 64 శాతం యూనిట్లలో బీఓడీ స్థాయిలు 90 మిల్లీగ్రాములకు పైగా ఉన్నట్లు వెల్లడి
లీటరుకు 50 మిల్లీగ్రాములు మించకూడని టీఎస్ఎస్ స్థాయిలు 365 మిల్లీగ్రాములకు చేరినట్లు కాలుష్య నియంత్రణ మండలి నివేదిక
ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లలో పర్యావరణ ప్రమాణాల అమలును ప్రతి 15 రోజులకు ఒకసారి పరీక్షించి నివేదికలు సమర్పించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం





