గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు షెడ్యూల్

మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, అదనపు కమిషనర్ బి. సంతోష్, అదనపు కమిషనర్ (ఎన్నికలు) జె. శంకరయ్య రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు..
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) జారీ చేసిన లేఖ నం. 322/LC/G&T/E-Roll/2027-BIEN (తేదీ: 14.09.2026) ప్రకారం de-novo పద్ధతిలో ఓటర్ల జాబితా రూపకల్పన షెడ్యూల్ విడుదలైందని కమిషనర్ తెలిపారు..
28.09.2026న బహిరంగ ప్రకటనతో ప్రారంభమైన ప్రక్రియ..
ప్రస్తుత జాబితాలో పేర్లు ఉన్నవారైనా సరే.. 'ఫారం-18' ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి..
'ఫారం-18' సమర్పణకు 06.11.2026 ఆఖరి తేదీ.. 25.11.2026న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ..
25.11.2026 నుంచి 10.12.2026 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలుకు గడువు.. 30.12.2026న తుది జాబితా విడుదల..
తొమ్మిది జిల్లాల పరిధిలో విస్తరించిన నియోజకవర్గంలో 19 మంది ఆర్డీవోలు ఏఈఆర్వోలుగా నియామకం..
ఆఫ్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు తహసీల్దార్లు, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, కంటోన్మెంట్ బోర్డు సీఈవోలు నిర్దేశిత అధికారులు..
దరఖాస్తుదారులు భారతీయ పౌరులై ఉండాలి, ఈ నియోజకవర్గ పరిధిలో సాధారణ నివాసితులై ఉండాలి మరియు 1 నవంబర్ 2026 నాటికి కనీసం మూడేళ్ల ముందే గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి..
డిగ్రీ సర్టిఫికెట్‌తో పాటు నివాస ధ్రువీకరణకు ఆధార్, EPIC, విద్యుత్ బిల్లు లేదా LPG వివరాలు సమర్పించాలి.. EPIC సమర్పణ ఐచ్ఛికం.





