భోలానగర్‌లో పర్యటించిన రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్‌పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి

సీవరేజ్, సీసీ రోడ్డు, స్టార్మ్ వాటర్ డ్రైన్ సమస్యలపై అధికారులతో సమీక్ష
హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బంజారాహిల్స్ డివిజన్, భోలానగర్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్‌పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి వాటర్ వర్క్స్, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా స్థానికులు సీవరేజ్ లైన్ల సమస్య, నూతన సీసీ రోడ్డు నిర్మాణం, గ్రీన్ బెల్ట్ సమీపంలో స్టార్మ్ వాటర్ డ్రైన్ ఏర్పాటు తదితర సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.
స్థానికుల సమస్యలను విన్న గద్వాల్ విజయలక్ష్మి సంబంధిత అధికారులతో అక్కడికక్కడే చర్చించి, అవసరమైన పరిశీలనలు పూర్తి చేసి సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని ఆమె తెలిపారు.
ఈ పర్యటనలో వాటర్ వర్క్స్, జీహెచ్‌ఎంసీ అధికారులు మరియు స్థానికులు పాల్గొన్నారు.





