స్పీకర్ల జాప్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పార్టీ ఫిరాయింపులు, ఎంపీలు, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ల కాలయాపనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
ఇతరులకు మార్గదర్శకాలు ఇచ్చే ముందు మనం అద్దంలో చూసుకోవాలంటూ జస్టిస్ బాగ్చీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్పీకర్లకు కఠిన కాలపరిమితి విధించే ముందు కోర్టుల్లో పేరుకుపోయిన కేసుల పెండెన్సీని కూడా గుర్తించాలని స్పష్టం చేశారు.
అనర్హత పిటిషన్లపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని గతంలో ఆదేశించినా అమలుకు నోచుకోలేదని ప్రస్తావించారు.
శాసన వ్యవస్థ ఆలస్యాన్ని ప్రశ్నించే సమయంలో న్యాయస్థానాల్లోనూ కేసుల ప్రక్రియ వేగవంతం కావాలని జస్టిస్ బాగ్చీ పేర్కొన్నారు.



