తెలుగు ఎడిషన్ · 13 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
అమెరికాలోనూ మార్మోగుతున్న శరణుఘోష.. అయ్యప్ప దీక్షతో వెల్లివిరుస్తున్న తెలుగు సంప్రదాయం!న్యూజెర్సీ రాబిన్స్‌విల్లేలో జరిగిన అయ్యప్ప భక్త మండలి భక్తి సమావేశంలో ధర్మం, అధర్మంపై చర్చ..న్యూజెర్సీలో అయ్యప్ప పూజ.. భక్తుల జయధ్వానాలతో మార్మోగిన రాబిన్స్‌విల్లేభద్రాద్రి అడవుల్లో మంత్రగాళ్ల నెపంతో ఇద్దరిని కొట్టి చంపిన నిందితులుఇరిగేషన్ డీఈఈ ఇంట్లో ఏసీబీ సోదాలు.. విల్లా, ఫ్లాట్లు, 25 ఎకరాల భూమి గుర్తింపు!అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కాల్పుల కలకలంచెన్నై నుంచి మలేషియాకి భారీగా ఎర్రచందనం స్మగ్లింగ్హైదరాబాద్ కి కొత్త రైలుఅమెరికాలోనూ మార్మోగుతున్న శరణుఘోష.. అయ్యప్ప దీక్షతో వెల్లివిరుస్తున్న తెలుగు సంప్రదాయం!న్యూజెర్సీ రాబిన్స్‌విల్లేలో జరిగిన అయ్యప్ప భక్త మండలి భక్తి సమావేశంలో ధర్మం, అధర్మంపై చర్చ..న్యూజెర్సీలో అయ్యప్ప పూజ.. భక్తుల జయధ్వానాలతో మార్మోగిన రాబిన్స్‌విల్లేభద్రాద్రి అడవుల్లో మంత్రగాళ్ల నెపంతో ఇద్దరిని కొట్టి చంపిన నిందితులుఇరిగేషన్ డీఈఈ ఇంట్లో ఏసీబీ సోదాలు.. విల్లా, ఫ్లాట్లు, 25 ఎకరాల భూమి గుర్తింపు!అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కాల్పుల కలకలంచెన్నై నుంచి మలేషియాకి భారీగా ఎర్రచందనం స్మగ్లింగ్హైదరాబాద్ కి కొత్త రైలు
వాతావరణం
📅 తేదీ వారీగా

భద్రాద్రి అడవుల్లో మంత్రగాళ్ల నెపంతో ఇద్దరిని కొట్టి చంపిన నిందితులు

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తమను చంపుతారనే భయంతో 30 ఏళ్ల రాంబాబు,అతని భార్య 25 ఏళ్ల సునీత ఆత్మహత్య

సమాజం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈరోజుల్లో కూడా..గిరిజన ,గొత్తి కోయలను మూఢ నమ్మకాలు వీడటం లేదు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఇప్పటికీ అనాగరిక ఘటనలు జరుగుతున్నాయి..మణుగూరు మండలం బుగ్గ అటవీ ప్రాంతంలో ఉన్న బడుగుల అనే వలస గిరిజన గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది, మంత్రాలు చేస్తున్నారనే నెపంతో ఇద్దరు వృద్ధులను హత్య చేసి పాతి పెట్టారు .. నిన్న రాత్రి అదే గ్రామంలో హత్యకు మాసయ్య కొడుకు కోడలు..తమను కూడా చంపుతారనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు..మొత్తం నలుగురు మృతి చెందడం తో ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది..

బుడుగుల గ్రామంలో గత కొంతకాలంగా భీమయ్య, మాసయ్యలు మంత్రాలు చేస్తూ స్థానికులను ఇబ్బందికి గురిచేస్తున్నారని వారు చేసే పూజల కారణంగా గ్రామంలో అనేకమంది మృత్యువాత పడుతున్నారనే కారణంతో కొందరు వ్యక్తులు మాసయ్య, భీమయ్య లను నెల రోజుల క్రితం కర్రలతో కొట్టి చంపి అడవిలోని ఓ చెక్ డ్యామ్ దగ్గర పాతిపెట్టారని మణుగూరు సిఐ నాగబాబు తెలిపారు, నెలరోజుల క్రితం ఘటన జరిగిందని, ఇద్దరూ వృద్ధులను హత్య చేసిన హంతకులను గుర్తించామని, ఈ హత్యల్లో ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నట్లుగా తెలిపారు, రెండు హత్యలకు సంబంధించి విచారణ కొనసాగుతుందని, ఇవి పూర్తిగా మంత్రాల నెపంతో జరిగిన హత్యలని పోలీసులు అంటున్నారు.. నిందితులు కోసం పోలీసులు గాలిస్తున్నారు

అయితే ఇదే గ్రామంలో మరో విషాద ఘటన జరిగింది..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

మణుగూరు మండలం బడుగుల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది

మణుగూరు లోని బుడుగుల గుత్తికొయ గ్రామంలో మంత్రాలు చేస్తున్నారని అనుమానంతో ఇటీవల చంపబడిన పద్దం మాసయ్య కుమారుడు రాంబాబు, (30 ), మరియు అతని భార్య సునీత, (25) విప్పసారా లో పురుగులు మందు తాగి ఆత్మ హత్య చేసుకున్నారు...మొత్తం నలుగురు మృతి చెందారు..ఇద్దరు హత్యకు గురైతే ..మరో ఇద్దరు తమను చంపుతారనే భయం తో ఆత్మహత్య చేసుకున్నారు.. జిల్లాలో ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి

సంబంధిత వార్తలు