ఇరిగేషన్ డీఈఈ ఇంట్లో ఏసీబీ సోదాలు.. విల్లా, ఫ్లాట్లు, 25 ఎకరాల భూమి గుర్తింపు!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాగర్‌కర్నూల్ జిల్లాలో పనిచేస్తున్న ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆర్.సత్యనారాయణ (44)కు సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
హైదరాబాద్ బైరామల్‌గూడలోని మాధవరం సెరినిటీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో పది ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి.
సోదాల్లో 50 తులాల బంగారం, తుక్కుగూడలో విల్లా, 25 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో రెండు ఫ్లాట్లు, ఐదు ఓపెన్ ప్లాట్లు, మూడు కార్లను గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ చలపతి వెల్లడించారు.
ప్రభుత్వ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ సుమారు రూ.6 కోట్లు ఉంటుందని, మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండవచ్చని అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.





