అమెరికాలోనూ మార్మోగుతున్న శరణుఘోష.. అయ్యప్ప దీక్షతో వెల్లివిరుస్తున్న తెలుగు సంప్రదాయం!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కార్తీక మాసం సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ అయ్యప్ప స్వామి భక్తులు భక్తిశ్రద్ధలతో దీక్షలు చేపడుతున్నారు.
విదేశాల్లో నివసిస్తున్న తెలుగు భక్తులు అయ్యప్ప మాలలు ధరించి, నియమనిష్ఠలతో పూజలు నిర్వహిస్తూ, భజనలు, భక్తిగీతాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు.
మాతృభూమికి వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తూ భావితరాలకు పరిచయం చేస్తున్నారు. అమెరికాలోనూ వినిపిస్తున్న ‘స్వామియే శరణం అయ్యప్ప’ నామస్మరణ భక్తులను ఆధ్యాత్మికంగా ఏకం చేస్తోంది.





