హైదరాబాద్ కి కొత్త రైలు

ఎంసీఆర్ హెచ్ ఆర్డీ బోధి పెవిలియన్ లో PRTS (పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్) పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.
ఎల్బీ స్టేడియం నుంచి అంబేద్కర్ విగ్రహం,ఇందిరా పార్క్,లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా రాణిగంజ్ బస్ స్టాండ్ వరకు ఒక లైన్ ఏర్పాటు చేయాలి..
అసెంబ్లీ మెట్రో నుంచి రవీంద్ర భారతి,సెక్రటేరియట్ , ఐమాక్స్ నుంచి బేగంపేట్ కు కలుపుతు ఇంకో లైన్ ఏర్పాటు చేయాలి..
నక్లేస్ రోడ్ లో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేసి అందులో పీఆర్టీఎస్ డిపో ఏర్పాటు చేయాలి..
కెపిహెచ్ బి మెట్రో స్టేషన్ నుంచి దుర్గం చెరువు,రహేజా మైండ్ స్పేస్,బయోడైవర్సిటీ మెట్రో స్టేషన్ వరకు లైన్ ను వెంటనే చేపట్టాలి..
గచ్చిబౌలి ఐకియా సమీపంలో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేసి అందులో పీఆర్టీఎస్ డిపో ఏర్పాటు చేయాలి..
డిసెంబర్ నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలి.
ఏడాది లో ఈ లైన్ పూర్తి అయ్యేలా చూడాలి..





