శ్రీకాళహస్తిలో ఇండిపెండెంట్ అభ్యర్థి పాండుపై హత్యాయత్నం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ గా పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి పాండురంగ @ పాండుపై హత్యాయత్నం జరిగింది. రాజీవ్ నగర్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కారు తో ఢీ కొట్టారు. దీంతో ఆయన తీవ్ర గాయాలతో బయట పడ్డారు. ఘటనా స్థలానికి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చేరుకుని పాండురంగను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పాండురంగ తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.





