హైదరాబాద్ శివార్లలో గంటపాటు భారీ వర్షం.. జలమయమైన రోడ్లు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఇస్నాపూర్, పటాన్‌చెరు, అమీన్‌పూర్, ఆర్సీ పురం, బీరంగూడ, కొల్లూరు, కీసర, ఘట్‌కేసర్, అనోజిగూడ పరిసరాల్లో సుమారు గంటపాటు వాన దంచికొట్టింది.
రహదారులపై నీరు నిలిచి జలమయమయ్యాయి. కొన్ని చోట్ల వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి.
ట్రాఫిక్ మందగించడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
మట్టడ నగర్‌లో భారీ వర్షం కురుస్తోందని, ఆటోలు, బైకులు నీటిలో కొట్టుకుపోతున్నాయని స్థానికులు వీడియోలో పేర్కొన్నారు.





