తెలుగు ఎడిషన్ · 27 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
వేటపాలెం మండల పందిళ్లపల్లి గ్రామంలో ఉద్రిక్తతగూగుల్ AI అనలిస్ట్ చార్లెస్ బ్రూమ్‌ఫీల్డ్ ఆర్థిక స్వాతంత్ర్యం లక్ష్యంఫెడరల్ ఏజెంట్లపై 1 మిలియన్ డాలర్ల దావా వేసిన డేయాన్ ఫిగ్యురోవాయూరోప్‌లో రష్యా విధ్వంసక దాడులు.. ఐఐఎస్ఎస్ హెచ్చరికహోబర్ట్‌లో బాలుడికి తీవ్ర గాయాలు.. స్మిత్‌పై ఆరోపణలుYSRCP USA కమిటీలో 24 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల నియామకంప్రభాకర్ రెడ్డి వర్ధంతి నివాళులువైఎస్ షర్మిల కుమార్తె అంజలి రఘురామ్ వివాహంవేటపాలెం మండల పందిళ్లపల్లి గ్రామంలో ఉద్రిక్తతగూగుల్ AI అనలిస్ట్ చార్లెస్ బ్రూమ్‌ఫీల్డ్ ఆర్థిక స్వాతంత్ర్యం లక్ష్యంఫెడరల్ ఏజెంట్లపై 1 మిలియన్ డాలర్ల దావా వేసిన డేయాన్ ఫిగ్యురోవాయూరోప్‌లో రష్యా విధ్వంసక దాడులు.. ఐఐఎస్ఎస్ హెచ్చరికహోబర్ట్‌లో బాలుడికి తీవ్ర గాయాలు.. స్మిత్‌పై ఆరోపణలుYSRCP USA కమిటీలో 24 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల నియామకంప్రభాకర్ రెడ్డి వర్ధంతి నివాళులువైఎస్ షర్మిల కుమార్తె అంజలి రఘురామ్ వివాహం
వాతావరణం
📅 తేదీ వారీగా

వేటపాలెం మండల పందిళ్లపల్లి గ్రామంలో ఉద్రిక్తత

క్రైమ్బాపట్ల
వేటపాలెం మండల పందిళ్లపల్లి గ్రామంలో ఉద్రిక్తత
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆమంచి కృష్ణమోహన్ ఇంటి ఎదుట మూడు కార్లలో అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారు.

ఆమంచి ఇంటి ఎదుట ఉన్న దుకాణం దగ్గర ఆగిన కారులోని గుర్తు తెలియని యువకులను గ్రామస్తులు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. ఆ సమయంలో వారు వాదనకు దిగి కత్తితో దాడి చేసేందుకు యత్నించారని స్థానికులు చెబుతున్నారు.

గ్రామస్తులు కేకలు వేయడంతో రెండు కార్లలోని దుండగులు పరారయ్యారు.

ఒక కారును అడ్డుకుని, అందులోని ముగ్గురు దుండగుల్లో ఒకరు పరారవ్వగా, మిగిలిన ఇద్దరిని పట్టుకుని గ్రామస్తులు స్తంభానికి కట్టేశారు.

పట్టుబడిన కారులో కత్తులు, కర్రలు ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు.

అదుపులోకి తీసుకున్న ఇద్దరు దుండగులను గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు.

ఆమంచి కృష్ణమోహన్ పై రెక్కీ నిర్వహిస్తున్నారని ఆయన అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

high

సంబంధిత వార్తలు