ప్రేమ వ్యవహారం పరువు తీస్తుందనే భయం.. కన్నకూతురినే హత్య చేసిన తండ్రి!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రిలో 18 ఏళ్ల కళ్యాణిని ఆమె తండ్రి కైలాస్ తెల్లవారుజామున హత్య చేశాడు. కూతురి ప్రేమ వ్యవహారం కుటుంబ పరువుకు భంగం కలిగిస్తుందనే కారణంతోనే ఈ ఘోరానికి పాల్పడినట్లు సీఐ గురుస్వామి తెలిపారు. హత్య అనంతరం మరో గదిలో ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు తండ్రి ప్రయత్నించాడు. ఉదయం 5 గంటల సమయంలో తల్లి ఈ విషయాన్ని గుర్తించింది. మృతదేహాన్ని దహనం చేయడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసుల విచారణలో కైలాస్ తన నేరాన్ని అంగీకరించాడు.





