ఎటపాకలో భారీగా గంజాయి పట్టివేత.. రూ. 5 లక్షల విలువైన 35 కేజీలు స్వాధీనం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎటపాకలో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి తెలంగాణలోని కరీంనగర్‌కు కారులో తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది.
గంజాయి తరలిస్తున్న కారు అతివేగంగా ప్రయాణిస్తూ రెండు వాహనాలను ఢీకొట్టింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేయగా గంజాయి బయటపడింది.
స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 5 లక్షలు. కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
గంజాయిని, కీయా కారును సీజ్ చేసి కేసు నమోదు చేశారు.





