హైదరాబాద్‌లో రేష్మా డాన్ అరెస్ట్.. చంపేస్తామంటూ బెదిరింపులు.. డబ్బుల కోసం వేధింపులు!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీసులు రేష్మా డాన్ అలియాస్ రేష్మ్ బేగాన్ని అరెస్ట్ చేశారు.
హషీంనగర్‌కు చెందిన అర్షియా ఖాన్ కుటుంబాన్ని గత వారం రోజులుగా రేష్మా డాన్ వేధిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తోంది. డబ్బులు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది.
గతంలో తన సోదరుడి నుంచి డబ్బులు వసూలు చేసి, అసభ్య పదజాలంతో దూషించి, దాడి చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
శనివారం ఉదయం అత్తాపూర్‌లోని ఎస్ఎన్ఆర్ గార్డెన్స్ సమీపంలో రేష్మా డాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హుమాయూన్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బైక్ దహనం కేసులో తన ప్రమేయం ఉన్నట్లు నిందితురాలు అంగీకరించింది.
కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆమెను జైలుకు తరలించారు.





