నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా నివాసంలో జరిగే వివాహ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులపై చర్చించనున్నారు.





