ఎన్నికల సంఘంపై 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇండియా కూటమి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎన్నికల సంఘం తీసుకున్న SIR నిర్ణయాలపై 48 ప్రశ్నలను రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఈ ప్రశ్నలను ఎన్నికల సంఘాన్ని అడగడానికి సుప్రీంకోర్టు అనుమతిని ఇండియా కూటమి కోరుతోంది.
దేశవ్యాప్త SIR నిర్ణయాన్ని ఎవరు ఆమోదించారనే అంశంపై ఈసీ దాఖలు చేసిన అఫిడవిట్‌కు సంబంధించి సమాధానాలు కోరుతూ కూటమి నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నిర్ణయాలపై ఈసీ నుంచి ప్రమాణపూర్వక సమాధానాలను కోరుతూ కూటమి నేతలు సుప్రీంకోర్టు అనుమతి కోరారు.
ఈసీ దాఖలు చేసిన అఫిడవిట్‌ను ఎన్నికల కమిషనర్లు ఆమోదించారా, SIRపై వారి అభ్యంతరాలు రికార్డ్ అయ్యాయా అని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు.
SIR నిర్ణయం ఏకగ్రీవమేనా అనే అంశంపై ఈసీ నుంచి ఎటువంటి ఆధారాలు లేవని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.





