జీతం తీసుకొస్తానని వెళ్లిన మహిళ అదృశ్యం.. నాగోల్‌లో కలకలం!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైపురి కాలనీకి చెందిన సంపంగి సుగుణ (35) అదృశ్యమయ్యారు.
ఈ నెల 6న ఉదయం 8:30 గంటలకు తాను పనిచేస్తున్న ఇళ్లలో జీతం తీసుకొస్తానని భర్త సురేష్‌కు చెప్పి బయటకు వెళ్లిన సుగుణ తిరిగి ఇంటికి రాలేదు.
కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన నాగోల్ పోలీసులు గాలింపు చేపట్టారు.





