తెలుగు ఎడిషన్ · 13 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
హైదరాబాద్ సీపీగా వీసీ సజ్జనార్ వీడ్కోలుజీతం తీసుకొస్తానని వెళ్లిన మహిళ అదృశ్యం.. నాగోల్‌లో కలకలం!హైదరాబాద్‌లో 9 KFC, డొమినోస్ బ్రాంచ్‌ల లైసెన్సులు సస్పెండ్ చేసిన అధికారులుకూతురి మందుల కోసం ఐదు వేల రూపాయలు దొంగిలించిన తండ్రి అరెస్ట్ఏపీకి భారీ పెట్టుబడులు.. సీఐఐ సదస్సులో కీలక ప్రకటనలుSM తో బాధపడుతున్న చిన్నారికి ఇంజక్షన్ ఖర్చు రూ.1 కోటి 40 లక్షలు.2027 యూపీ ఎన్నికల్లో ఒవైసీ, ఆజాద్ కూటమి.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రశేఖర్ ఆజాద్శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో పేలిన‌ గ్యాస్ సిలిండ‌ర్హైదరాబాద్ సీపీగా వీసీ సజ్జనార్ వీడ్కోలుజీతం తీసుకొస్తానని వెళ్లిన మహిళ అదృశ్యం.. నాగోల్‌లో కలకలం!హైదరాబాద్‌లో 9 KFC, డొమినోస్ బ్రాంచ్‌ల లైసెన్సులు సస్పెండ్ చేసిన అధికారులుకూతురి మందుల కోసం ఐదు వేల రూపాయలు దొంగిలించిన తండ్రి అరెస్ట్ఏపీకి భారీ పెట్టుబడులు.. సీఐఐ సదస్సులో కీలక ప్రకటనలుSM తో బాధపడుతున్న చిన్నారికి ఇంజక్షన్ ఖర్చు రూ.1 కోటి 40 లక్షలు.2027 యూపీ ఎన్నికల్లో ఒవైసీ, ఆజాద్ కూటమి.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రశేఖర్ ఆజాద్శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో పేలిన‌ గ్యాస్ సిలిండ‌ర్
వాతావరణం
📅 తేదీ వారీగా

కూతురి మందుల కోసం ఐదు వేల రూపాయలు దొంగిలించిన తండ్రి అరెస్ట్

ప్రత్యేక కథనంజాతీయం
కూతురి మందుల కోసం ఐదు వేల రూపాయలు దొంగిలించిన తండ్రి అరెస్ట్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఒక తండ్రికి పిల్లల ఫీజు కష్టం.. మరో తండ్రికి కూతురి మందుల కోసం ఆరాటం.. రూ.5 వేల చోరీ వెనుక కన్నీటి కథ!

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో జరిగిన రూ.5 వేల చోరీ ఘటనలో ఇద్దరు తండ్రుల ఆర్థిక కష్టాలు వెలుగులోకి వచ్చాయి.

పిల్లల స్కూల్ ఫీజు చెల్లించేందుకు కష్టపడి సంపాదించిన రూ.5 వేలతో ఇంటికి వెళ్తున్న ఓ టైలర్‌ను జలగం వెంగళరావు పార్కు వద్ద సాధిక్ (39) అనే వ్యక్తి అడ్డుకున్నాడు. బైక్ నుంచి పెట్రోల్ లీకవుతోందని చెప్పి దృష్టి మరల్చి, జేబులోని డబ్బును అపహరించినట్లు పోలీసులు తెలిపారు.

సీసీటీవీ దృశ్యాలు, బైక్ నంబర్ ఆధారంగా యాకుత్‌పురాకు చెందిన సాధిక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనారోగ్యంతో ఉన్న తన కుమార్తెకు మందులు కొనడానికి డబ్బుల్లేక చోరీ చేసినట్లు విచారణలో నిందితుడు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.

చోరీ చేసిన రూ.5 వేలలో రూ.1,100 మందుల కోసం ఖర్చు చేయగా, మిగిలిన మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

ఒకరి పిల్లల చదువు కోసం దాచుకున్న డబ్బు.. మరొకరి బిడ్డ వైద్యం కోసం జరిగిన చోరీ.. ఈ ఘటనలో ఇద్దరు తండ్రుల కష్టాలు చర్చనీయాంశమయ్యాయి.

సంబంధిత వార్తలు