హైదరాబాద్‌లో 9 KFC, డొమినోస్ బ్రాంచ్‌ల లైసెన్సులు సస్పెండ్ చేసిన అధికారులు
హైదరాబాద్‌లో KFC, డొమినోస్ ఔట్‌లెట్లలో బొద్దింకలు, ఎలుకల వ్యర్థాలు.. 9 బ్రాంచ్‌ల లైసెన్సులు సస్పెండ్!
హైదరాబాద్‌లోని KFC, డొమినోస్ పిజ్జా ఔట్‌లెట్లపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (TG SAFE) ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. మొత్తం 26 ఔట్‌లెట్లలో 13 బృందాలు సోదాలు నిర్వహించగా, పలు చోట్ల ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
కొన్ని ఔట్‌లెట్లలో బొద్దింకలు, ఈగలు, ఎలుకల వ్యర్థాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, అపరిశుభ్రమైన వంటగదులు గుర్తించారు. వాడిన వంటనూనెను తిరిగి ఉపయోగించేందుకు అనుమతి లేని రసాయనాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు.
లైసెన్సులు సస్పెండ్ అయిన 9 ఔట్‌లెట్లు:
డొమినోస్ (2): కొండాపూర్ శరత్ సిటీ మాల్, మాదాపూర్ ఇనార్బిట్ మాల్.
KFC (7): మదీనాగూడ, సింధీ కాలనీ, చార్మినార్ పంచ్ మొహల్లా, మూసారాంబాగ్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ శిల్పకళావేదిక, మాదాపూర్ ఇనార్బిట్ మాల్.
తనిఖీల్లో 20 ఆహార నమూనాలు సేకరించడంతో పాటు 52 కిలోల సింథటిక్ మెగ్నీషియం సిలికేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది ఔట్‌లెట్లకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు, మరో ఐదింటికి షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు.
లైసెన్సులు పునరుద్ధరించే వరకు సస్పెండ్ అయిన తొమ్మిది ఔట్‌లెట్లను స్విగ్గీ, జొమాటో నుంచి తొలగించాలని కోరనున్నట్లు అధికారులు వెల్లడించారు.





