అంబేద్కర్ కోనసీమ జిల్లా: సెంటర్: కొత్తపేట.

రావులపాలెంలో ఎలక్ట్రికల్ స్కూటీ పేలి ఒక కారు, మరో బుల్లెట్ దగ్ధం
రావులపాలెంలోని సి.ఆర్.సి రోడ్డులో గల బండారు నాగ వాసుకి కి చెందిన లక్ష్మీ నివాస్ అపార్ట్మెంట్లో చోటు చేసుకున్న ఘటన.
అపార్ట్మెంట్ సెల్లార్లో ఎలక్ట్రికల్ స్కూటీ చార్జింగ్ పెట్టి అపార్ట్మెంట్ లోకి వెళ్లిన యజమాని.
ఒక్కసారిగా చార్జింగ్ పెట్టిన రూ. ఒక లక్ష విలువైన స్కూటీ పేలి అదే అపార్ట్మెంట్లో ఉన్న రూ.10 లక్షలు ఖరీదైన కొత్త టాటా పంచ్ కారు, రూ.1.50 లక్షలు విలువైన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధం.
ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనాలు, అపార్ట్మెంట్ పివిసి పైప్ లైన్లు, ఎలక్ట్రికల్ వైర్లు కాలిపోయి ఎగసిపడిన మంటలు.
చెలరేగిన మంటలతో భయాందోళనకు గురై అపార్ట్మెంట్ లోని ప్లాట్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు.
చెలరేగిన మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చిన కొత్తపేట అగ్నిమాపక సిబ్బంది.





