✨🪔దుబాయ్ ఆకాశంలో దీపావళి మ్యాజిక్‌కు కౌంట్‌డౌన్.. 600 డ్రోన్లతో అద్భుత ప్రదర్శన!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
దీపావళి వేడుకలకు దుబాయ్ గ్లోబల్ విలేజ్ రంగురంగులుగా సిద్ధమవుతోంది. నవంబర్ 6 నుంచి 10 వరకు జరిగే ప్రత్యేక వేడుకల్లో భాగంగా 600 డ్రోన్లతో భారీ లైట్ షో నిర్వహించనున్నారు.
నవంబర్ 8 రాత్రి 8 గంటలకు ఆకాశంలో దీపావళి థీమ్‌తో ప్రత్యేక ఆకృతులు, రంగుల వెలుగులు కనువిందు చేయనున్నాయి.
డ్రోన్ షోతో పాటు సంగీత కార్యక్రమాలు, దీపావళి మేళా, భారతీయ వంటకాలు, కుటుంబ వినోద కార్యక్రమాలతో దుబాయ్‌లో భారతీయ పండుగ సందడి నెలకొననుంది.





